Header Banner

విషాదం.. కావేరీ నదిలో శవమై తేలిన ICAR మాజీ చీఫ్! చరిత్రలో మొదటి వ్యక్తి..

  Sun May 11, 2025 13:45        Politics

ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) మాజీ డైరెక్టర్ జనరల్.. పద్మ శ్రీ అవార్డు గ్రహీత సుబ్బన్న అయ్యప్పన్ అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. కావేరీ నదిలో ఆయన మృతదేహం లభించింది. శనివారం శ్రీరంగపట్నం దగ్గరలో.. నదిలో తేలుతున్న ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయ్యప్పన్ మృతదేహాన్ని నీటిలోంచి బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై స్పందిస్తూ.. ‘నది ఒడ్డున ఓ టూవీలర్ ఆపి ఉంది. ఆయన ఇక్కడికి వచ్చి నదిలో దూకి ఉండొచ్చని అనుమానిస్తున్నాము. ఏది ఏమైనప్పటికి దర్యాప్తులో ఆయన చావుకు సంబంధించిన అసలైన కారణాలు బయటపడతాయి’ అని అన్నారు. నాన్ క్రాప్ విభాగం నుంచి ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR)కు డైరెక్టర్ జనరల్ అయిన మొదటి వ్యక్తి సుబ్బన్న అయ్యప్పన్ కావటం విశేషం. ఆయన వ్యవసాయం, మత్స్య సంపద శాస్త్రవేత్తగా ఎన్నో సేవలు అందించారు. భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి.. పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాంటి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరావటం లేదు. ఆయన మే 7వ తేదీన ఇంటినుంచి కనిపించకుండా పోయారు. కావేరీ నదిలో శవమై తేలారు.

 

ఇది కూడా చదవండి: చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Karnataka #KaveriRiver #ICAR